గ్లామరస్ హీరోయిన్ తాప్సీ ఓ బడా ప్రాజెక్ట్
చేజిక్కించుకుందని సమాచారం.
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో తాప్సీ తొందరలోనే స్క్రీన్ని షేర్
చేసుకోనుందని ఫిల్మ్ సర్కిల్స్ సమాచారం.
థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తాప్సీ కి ఛాన్స్ రాగానే ఏ మాత్రం
ఆలోచించకుండా ఒప్పెసుకుందనీ వినికిడి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్
ఎవరికీ వస్తుందా అని కొంతకాలంగా అబిమానులు ఎదురుచూశారు. మొత్తానికి అమ్మడు ఓ మంచి అవకాశాన్ని అందుకుంది. మరి
ఇంతటి బంపర్ ఛాన్స్ తోనైనా బాలీవుడ్ కి
తాప్సీ మకాం మార్చగలదేమో చూడాలి. అన్నట్టు ఈ సొట్ట బుగ్గల సుందరికి అక్షయ్ కుమార్
సరసన నటించే అవకాశం మరోసారి వచ్చిందట. అన్నీ కుదిరితే 'కత్తి' రీమేక్
లో అక్షయ్ కుమార్ సరసన తాప్సీ నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
No comments:
Post a Comment