Sunday 10 January 2016

తెరపై మెగాస్టార్ కుమార్తె?


మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా తెరంగేట్రం చేయడానికి నిహారికి ట్రై చేస్తుందనీ ప్రస్తుతం టాలీవుడ్ లో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మెగా ఫ్యామిలీ నుంచి మరో అమ్మాయి స్క్రీన్ పై కనపడనుందన్న వార్త టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారింది. 
మెగాస్టార్ చిరంజీవి రెండవ కుమార్తె శ్రీజ తొందరలోనే స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చే చాన్సులు ఉన్నాయని తెలుస్తోంది. అయితే, శ్రీజ ఎంట్రీ ఇచ్చేది సిల్వర్ స్క్రీన్ మీదా లేదా స్మాల్ స్క్రీన్ మీదా అన్నది ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం శ్రీజా ఓ బెల్లీ డాన్సు నేర్చుకుంటుందనీ ఇండస్ట్రీలో వార్తలు తెగ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ వార్త నిజమే అయితే మెగా ఫ్యామిలీ నుంచి మరో నటి తెలుగు ప్రేక్షకులకు దొరికినట్లే. 

నా సినిమాలే నాకు పోటీ - బాలకృష్ణ


'నాకు ఎవరూ పోటీ కాదు. నా సినిమాలే నాకెప్పుడు పోటీగా భావిస్తుంటాను' అని నందమూరి బాలకృష్ణ తన మనసులోనున్న మాటను చెప్పుకొచ్చాడు. బాలకృష్ణ, అంజలి, సోనాల్ చౌహాన్ ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం 'డిక్టేటర్'. ఈ సినిమా పాటల విజయోత్సవం శనివారం రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడాడు. తన కెరియర్లో జానపద, పౌరాణిక, సోషియో ఫాంటసీ వంటి విభిన్న చిత్రాల్లో నటించే అదృష్టం వరించిందనీ, తన వారసత్వంగా తన కొడుకు మోక్షజ్ఞ కూడా సినిమాల్లో నటిస్తాడనీ అన్నాడు. 

Friday 8 January 2016

అందాల లావణ్య






తాప్సీకి బంపర్ ఆఫర్


గ్లామరస్ హీరోయిన్ తాప్సీ ఓ బడా ప్రాజెక్ట్ చేజిక్కించుకుందని సమాచారం. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో తాప్సీ తొందరలోనే స్క్రీన్ని షేర్ చేసుకోనుందని ఫిల్మ్ సర్కిల్స్ సమాచారం. థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తాప్సీ కి ఛాన్స్ రాగానే ఏ మాత్రం ఆలోచించకుండా ఒప్పెసుకుందనీ వినికిడి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఎవరికీ వస్తుందా అని కొంతకాలంగా అబిమానులు ఎదురుచూశారు. మొత్తానికి అమ్మడు ఓ మంచి అవకాశాన్ని అందుకుంది. మరి ఇంతటి బంపర్ ఛాన్స్ తోనైనా బాలీవుడ్ కి తాప్సీ మకాం మార్చగలదేమో చూడాలి. అన్నట్టు ఈ సొట్ట బుగ్గల సుందరికి అక్షయ్ కుమార్ సరసన నటించే అవకాశం మరోసారి వచ్చిందట. అన్నీ కుదిరితే 'కత్తి' రీమేక్ లో అక్షయ్ కుమార్ సరసన తాప్సీ నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

Wednesday 6 January 2016

ఎన్టీఆర్ సినిమాలో నిత్యా, సమంత?

నిత్యా మీనన్, సమంత మరోసారి స్క్రీన్ ని షేర్ చేసుబోతున్నట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించే ఓ చిత్రంలో ఈ ముద్దుగుమ్మలిద్దరూ నటించబోతున్నట్టు తెలుగు సినిమా సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. 'సన్ అఫ్ సత్యమూర్తి' చిత్రం తరువాత నిత్యా మీనన్, సమంత మళ్ళీ కలిసి నటించబోతున్న సినిమా ఇదే కావడం విశేషం. అయితే, ఈ విషయం గురించి ఇంకా అధికారక ప్రకటన రావాల్సుంది. నిత్యా ప్రస్తుతం తమిళ, కన్నడ మూవీస్ తో బిజీగా ఉంది. అలాగే సమంత ప్రస్తుతం తెలుగులో కొన్ని ప్రాజెక్టులతో బిజీగానున్న సంగతి తెలిసిందే. అన్నీ కుదిరితే ఈ మూవీ షూటింగ్ ఫిబ్రవరి నుంచి మొదలవుతుంది.


మెగాస్టార్ సరసన నయనతార?




మెగాస్టార్ చిరంజీవి నటించబోయే 150వ సినిమా గురించి మెగా అభిమానుల్లో ఎంత ఆతృత ఉందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఎంతో కాలంగా మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ మెగా ప్రాజెక్ట్ తొందరలోనే పట్టాలెక్కనుంది.  చిరంజీవి 'కత్తి' సినిమా రీమేక్ లో నటించబోతున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి తాజాగా ఓ విషయం తెలిసింది. ఈ మెగా ప్రాజెక్ట్ లో  చిరంజీవి సరసన నయనతార నటించబోతుందనీ టాలీవుడ్ కథనం. ఈ చిత్రానికి వినాయక్ దర్శకత్వం వహిస్తాడు. రాం చరణ్ తేజ్ ఈ మూవీ ని ప్రొడ్యూస్ చేయనున్నాడు.



మరోసారి తెరపై ఆదిత్య, శ్రద్ధాకపూర్?



ఆదిత్య రాయ్ కపూర్శ్రద్ధాకపూర్ జంటగా తెరకెక్కిన 'ఆషికి 2' సినిమా బాలీవుడ్ లో ఎంత సక్సెస్ అయ్యిందో ప్రేక్షకులకు తెలియంది కాదు. ఈ సినిమా తరువాత శ్రద్ధాకపూర్, ఆదిత్యాలకి హిందీ చిత్ర పరిశ్రమలో ఓ స్టార్ డం ఏర్పడింది. ఈ సినిమా తరువాత మళ్ళీ ఆదిత్యశ్రద్ధా స్క్రీన్ ని షేర్ చేసుకోబోతున్నట్టు సమాచారం. 
అది కూడా సౌత్ ఇండియన్ మోస్ట్ పాపులర్ డైరెక్టర్ మణి రత్నం తెరకెక్కించిన 'ఓ కాదల్ కన్మణి' రీమేక్ తో. ఈ సినిమా తెలుగులో 'ఓకే బంగారం'గా డబ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా హిందీలో రీమేక్ కానుంది. ఆ సినిమాని కరణ్ జోహార్ నిర్మించే సూచనలు కనిపిస్తున్నాయి. షాద్ అలీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు. షాద్ అలీ ఇంతకుముందు మణిరత్నం తెరకెక్కించిన 'సఖి' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశాడు. ఆ సినిమా హిందీలో 'సాతియ'గా రిలీజ్ అయింది. 
ఇదిలా ఉంటే, మరోసారి తెరపై తళుక్కుమనే ఆదిత్య, శ్రద్ధా జంటనీ చూడాలనీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సారి ఆ జంట ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. 

రాజకుమారి కథకి ఇళయరాజా మ్యూజిక్



మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సాంగ్ కంపోజ్ చేశాడంటే చాలు.... ఆ పాట ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ మ్యూజిక్ డైరెక్టర్ ప్రస్తుతం ఓ తెలుగు సినిమాకి సైన్ చేశాడట. నారా రోహిత్ హీరోగా నటించే ఓ సినిమాకి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నట్టు సమాచారం. నూతన దర్శకుడు మహేష్ సూరపనేని డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. టాప్ డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన 'రుద్రమదేవి' సినిమా తరువాత ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఇళయరాజా ఇప్పటికే ఈ మూవీ కోసం మూడు పాటలు కంపోజ్ చేశాడట. ఈ పాటలను రామజోగయ్య శాస్త్రి రాసినట్టు సమాచారం. 

నిఖిల్, స్వాతి జంటగా వచ్చిన 'కార్తికేయ' సినిమాని ప్రొడ్యూస్ చేసిన వెంకట్ శ్రీనివాస్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమా కథ చాలా డిఫరెంట్ గా ఉంటుందనీ, ఇందులో రోహిత్ పాత్ర హైలైట్ గా నిలుస్తుందనీ మీడియాతో చెప్పాడు వెంకట్ శ్రీనివాస్. ఈ నెలలోనే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ కానుంది. అన్నట్టు ఈ సినిమాకి 'కథలో రాజకుమారి' అన్న టైటిల్ ని ఖరారు చేసినట్టు సమాచారం. ఈ చిత్రంలో నమిత ప్రమోద్ అనే మళయాళ నటి హీరోయిన్ గా నటించనుంది. 

Tuesday 5 January 2016

రకుల్ సిస్టర్ గా కుమారి?


'కుమారి 21ఎఫ్' సినిమాలో తన నటనతో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన హెబా పటేల్ ఓ టాప్ హీరోయిన్ కి సోదరి పాత్రలో నటించిందట. అదేంటి ఓ హీరోయిన్ మరో హీరోయిన్ కి సిస్టర్ పాత్రలో నటించడమా? అని ఆశ్చర్యపోతున్నారా? కాని ఇది నిజమంటున్నాయి తెలుగు సినిమా సర్కిల్స్. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే? యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'నాన్నకు ప్రేమతో' సినిమా. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జంటగా రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సంగతి తెలిసిందే. రకుల్ సోదరి పాత్రలో హెబా పటేల్ నటించిందనీ పలువురు సినీ ప్రముఖులు చెబుతున్నారు. 

'కుమారి 21ఎఫ్' సినిమాలో హెబా పటేల్ నటనకి సుకుమార్ బాగా ఇంప్రెస్ అయ్యాడట. దాంతో 'నాన్నకు ప్రేమతో' సినిమాలో హెబా కోసం ప్రేత్యేకించి ఓ రోల్ ని క్రియేట్ చేశాడట. హీరోయిన్ కి సోదరి పాత్ర అయినప్పటికీ హెబా పాత్ర 'నాన్నకు ప్రేమతో' సినిమాకి ఎంతో కీలకమనీ తెలుస్తోంది. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది.

కమల్ హాసన్ సినిమాలో శృతి?

తన ప్రతీ సినిమాలో అద్భుతమైన నటనని ప్రదర్శించి ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేయడం కమల్ హాసన్ కి కొత్తేమి కాదు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, గాయకుడిగా, నిర్మాతగా, స్క్రిప్ట్ రైటర్ గా.... ఇలా పలు విధాలుగా కూడా తనలోనున్న ప్రతిభని ప్రదర్శించి ప్రేక్షకుల మనసు దోచుకుంటునే ఉన్నాడు కమల్. అందుకే కమల్ హాసన్ కి అభిమానులు ఎక్కువే. 

అలాగే కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ కూడా తన వైవిధ్యభరితమైన ప్రతిభతో అభిమానుల్ని బాగానే ఆకట్టుకుంది. అయితే, ఇంతలా అభిమానుల్ని ఆకట్టుకున్న కమల్, శృతి హాసన్ కలిసి స్క్రీన్ ఎప్పుడు షేర్ చేసుకుంటారోననీ ఇంతకాలంగా అభిమానులు ఎదురుచూశారు. ఆ అభిమానులకు శుభవార్తా రానేవచ్చింది. కమల్, శృతి కలిసి తొందరలోనే నటించబోతున్నట్టు సినిమా ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో వారిద్దరూ తండ్రి కూతురుగా నటిస్తున్నట్టు కథనం. ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సున్నప్పటికీ అభిమానులలో ఈ వార్త ఉత్కంఠ రేపుతోంది. ఈ ప్రాజెక్ట్ కి రాజీవ్ కుమార్ దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. 

రాజమౌళి రూటు మార్చాడా?


తెలుగు చిత్ర పరిశ్రమకు 'బాహుబలి' వంటి సినిమానిచ్చి టాలీవుడ్ స్థాయి పెంచేసిన డైరెక్టర్ రాజమౌళి రూటు మార్చాడా? అంటే అవునంటున్నాయి తెలుగు సినిమా సర్కిల్స్. ఇంతకీ రాజమౌళి ఏంటి రూటు మార్చడమేంటి? అనుకుంటున్నారా? అదేం లేదండి. ప్రభాస్, తమ్మన్నా, అనుష్క వంటి స్టార్స్ తో 'బాహుబలి' సినిమాని తెరకెక్కించి రికార్డులు బద్దలు కొట్టాడు ఈ డైరెక్టర్. అయితే ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే కొట్టేసింది కానీ, కామెడీ మాత్రం అంతగా లేదనీ కొన్ని విమర్శలు తెచ్చుకుందట. దాంతో రాజమౌళి రూటు మార్చి 'బాహుబలి 2'లో మంచి కామెడీతో ఆడియన్స్ ని ఇంకా ఆకట్టుకోవాలని ఓ ప్లాన్ వేశాడట.
కృష్ణవంశీ 'ఖడ్గం' సినిమాలో '30 ఇయర్స్ ఇండస్ట్రీ' అంటూ తన కామెడీతో ఆడియన్స్ ని ఓ రేంజ్ లో అలరించిన పృద్వీరాజ్ 'బాహుబలి 2'లో ఉన్నాడన్నది తెలుగు ఇండస్ట్రీ సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్ లో పృద్వీరాజ్ టాప్ కమెడియన్. ఇటీవల ఈ కమెడియన్ నటించిన సినిమాలన్నీ సంచలనం సృష్టించాయి. దాంతో, టాలీవుడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్ రాజమౌళి కూడా తన సినిమాలో పృద్వీరాజ్ కి ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తోంది.
'బాహుబలి' మొదటి భాగం షూటింగ్ అప్పుడే 'బాహుబలి 2' స్క్రిప్ట్ ని రాజమౌళి తయారు చేశాడట. అయితే మొదటి భాగం మీద వచ్చిన ఫీడ్ బ్యాక్ తో రెండవ భాగాన్ని రూపుదిద్దుతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే పృద్వీరాజ్ పాత్రని కూడా తెచ్చిపెట్టినట్టు టాలీవుడ్ కథనం. ప్రస్తుతం 'బాహుబలి 2' షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది.

Monday 4 January 2016

'డిక్టేటర్' లేటెస్ట్ యాక్షన్ టీజర్




నందమూరి బాలకృష్ణ 'డిక్టేటర్' మూవీ రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగానున్న నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ మధ్యే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఫినిష్ అయినట్టు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఫైనల్ స్టేజ్ లో ఉన్నట్టు సమాచారం. నందమూరి బాలకృష్ణ కూడా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ పనుల్లో బాగా బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ టీజర్ ప్రస్తుతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ వీడియో 'కొత్త మూవీ సంగతులు' అభిమానుల కోసం. 




Sunday 3 January 2016

నాన్నకు ప్రేమతో కొత్త పోస్టర్



రానున్న సినిమాలు

నాన్నకు ప్రేమతో               జనవరి 13
ఎక్ష్ప్రెస్ రాజా                     జనవరి 14
డిక్టేటర్                             జనవరి 14
సోగ్గాడే చిన్ని నాయనా      జనవరి 15
స్పీడున్నోడు                    ఫిబ్రవరి 4 
అ ఆ                               ఫిబ్రవరి 14