Showing posts with label kamal hassan. Show all posts
Showing posts with label kamal hassan. Show all posts

Tuesday, 5 January 2016

కమల్ హాసన్ సినిమాలో శృతి?

తన ప్రతీ సినిమాలో అద్భుతమైన నటనని ప్రదర్శించి ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేయడం కమల్ హాసన్ కి కొత్తేమి కాదు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, గాయకుడిగా, నిర్మాతగా, స్క్రిప్ట్ రైటర్ గా.... ఇలా పలు విధాలుగా కూడా తనలోనున్న ప్రతిభని ప్రదర్శించి ప్రేక్షకుల మనసు దోచుకుంటునే ఉన్నాడు కమల్. అందుకే కమల్ హాసన్ కి అభిమానులు ఎక్కువే. 

అలాగే కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ కూడా తన వైవిధ్యభరితమైన ప్రతిభతో అభిమానుల్ని బాగానే ఆకట్టుకుంది. అయితే, ఇంతలా అభిమానుల్ని ఆకట్టుకున్న కమల్, శృతి హాసన్ కలిసి స్క్రీన్ ఎప్పుడు షేర్ చేసుకుంటారోననీ ఇంతకాలంగా అభిమానులు ఎదురుచూశారు. ఆ అభిమానులకు శుభవార్తా రానేవచ్చింది. కమల్, శృతి కలిసి తొందరలోనే నటించబోతున్నట్టు సినిమా ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో వారిద్దరూ తండ్రి కూతురుగా నటిస్తున్నట్టు కథనం. ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సున్నప్పటికీ అభిమానులలో ఈ వార్త ఉత్కంఠ రేపుతోంది. ఈ ప్రాజెక్ట్ కి రాజీవ్ కుమార్ దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి.