Wednesday 6 January 2016

రాజకుమారి కథకి ఇళయరాజా మ్యూజిక్



మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సాంగ్ కంపోజ్ చేశాడంటే చాలు.... ఆ పాట ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ మ్యూజిక్ డైరెక్టర్ ప్రస్తుతం ఓ తెలుగు సినిమాకి సైన్ చేశాడట. నారా రోహిత్ హీరోగా నటించే ఓ సినిమాకి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నట్టు సమాచారం. నూతన దర్శకుడు మహేష్ సూరపనేని డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. టాప్ డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన 'రుద్రమదేవి' సినిమా తరువాత ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఇళయరాజా ఇప్పటికే ఈ మూవీ కోసం మూడు పాటలు కంపోజ్ చేశాడట. ఈ పాటలను రామజోగయ్య శాస్త్రి రాసినట్టు సమాచారం. 

నిఖిల్, స్వాతి జంటగా వచ్చిన 'కార్తికేయ' సినిమాని ప్రొడ్యూస్ చేసిన వెంకట్ శ్రీనివాస్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమా కథ చాలా డిఫరెంట్ గా ఉంటుందనీ, ఇందులో రోహిత్ పాత్ర హైలైట్ గా నిలుస్తుందనీ మీడియాతో చెప్పాడు వెంకట్ శ్రీనివాస్. ఈ నెలలోనే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ కానుంది. అన్నట్టు ఈ సినిమాకి 'కథలో రాజకుమారి' అన్న టైటిల్ ని ఖరారు చేసినట్టు సమాచారం. ఈ చిత్రంలో నమిత ప్రమోద్ అనే మళయాళ నటి హీరోయిన్ గా నటించనుంది. 

No comments:

Post a Comment