Showing posts with label hebha patel. Show all posts
Showing posts with label hebha patel. Show all posts

Tuesday, 5 January 2016

రకుల్ సిస్టర్ గా కుమారి?


'కుమారి 21ఎఫ్' సినిమాలో తన నటనతో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన హెబా పటేల్ ఓ టాప్ హీరోయిన్ కి సోదరి పాత్రలో నటించిందట. అదేంటి ఓ హీరోయిన్ మరో హీరోయిన్ కి సిస్టర్ పాత్రలో నటించడమా? అని ఆశ్చర్యపోతున్నారా? కాని ఇది నిజమంటున్నాయి తెలుగు సినిమా సర్కిల్స్. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే? యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'నాన్నకు ప్రేమతో' సినిమా. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జంటగా రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సంగతి తెలిసిందే. రకుల్ సోదరి పాత్రలో హెబా పటేల్ నటించిందనీ పలువురు సినీ ప్రముఖులు చెబుతున్నారు. 

'కుమారి 21ఎఫ్' సినిమాలో హెబా పటేల్ నటనకి సుకుమార్ బాగా ఇంప్రెస్ అయ్యాడట. దాంతో 'నాన్నకు ప్రేమతో' సినిమాలో హెబా కోసం ప్రేత్యేకించి ఓ రోల్ ని క్రియేట్ చేశాడట. హీరోయిన్ కి సోదరి పాత్ర అయినప్పటికీ హెబా పాత్ర 'నాన్నకు ప్రేమతో' సినిమాకి ఎంతో కీలకమనీ తెలుస్తోంది. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది.