Showing posts with label bahubali. Show all posts
Showing posts with label bahubali. Show all posts

Tuesday, 5 January 2016

రాజమౌళి రూటు మార్చాడా?


తెలుగు చిత్ర పరిశ్రమకు 'బాహుబలి' వంటి సినిమానిచ్చి టాలీవుడ్ స్థాయి పెంచేసిన డైరెక్టర్ రాజమౌళి రూటు మార్చాడా? అంటే అవునంటున్నాయి తెలుగు సినిమా సర్కిల్స్. ఇంతకీ రాజమౌళి ఏంటి రూటు మార్చడమేంటి? అనుకుంటున్నారా? అదేం లేదండి. ప్రభాస్, తమ్మన్నా, అనుష్క వంటి స్టార్స్ తో 'బాహుబలి' సినిమాని తెరకెక్కించి రికార్డులు బద్దలు కొట్టాడు ఈ డైరెక్టర్. అయితే ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే కొట్టేసింది కానీ, కామెడీ మాత్రం అంతగా లేదనీ కొన్ని విమర్శలు తెచ్చుకుందట. దాంతో రాజమౌళి రూటు మార్చి 'బాహుబలి 2'లో మంచి కామెడీతో ఆడియన్స్ ని ఇంకా ఆకట్టుకోవాలని ఓ ప్లాన్ వేశాడట.
కృష్ణవంశీ 'ఖడ్గం' సినిమాలో '30 ఇయర్స్ ఇండస్ట్రీ' అంటూ తన కామెడీతో ఆడియన్స్ ని ఓ రేంజ్ లో అలరించిన పృద్వీరాజ్ 'బాహుబలి 2'లో ఉన్నాడన్నది తెలుగు ఇండస్ట్రీ సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్ లో పృద్వీరాజ్ టాప్ కమెడియన్. ఇటీవల ఈ కమెడియన్ నటించిన సినిమాలన్నీ సంచలనం సృష్టించాయి. దాంతో, టాలీవుడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్ రాజమౌళి కూడా తన సినిమాలో పృద్వీరాజ్ కి ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తోంది.
'బాహుబలి' మొదటి భాగం షూటింగ్ అప్పుడే 'బాహుబలి 2' స్క్రిప్ట్ ని రాజమౌళి తయారు చేశాడట. అయితే మొదటి భాగం మీద వచ్చిన ఫీడ్ బ్యాక్ తో రెండవ భాగాన్ని రూపుదిద్దుతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే పృద్వీరాజ్ పాత్రని కూడా తెచ్చిపెట్టినట్టు టాలీవుడ్ కథనం. ప్రస్తుతం 'బాహుబలి 2' షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది.